టిడిపి మాజీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి
నవగీతం,పెద్డపల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అక్కపాక తిరుపతి పార్టీ శ్రేణులతో కలిసి జన్మదిన కేక్ కట్ చేసి,లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్కపాక తిరుపతి మాట్లాడుతూ,స్వర్గీయ నందమూరి తారకరామారావు మనుమడిగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ బాబు,తనదైన పనితీరుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని కొనియాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ,ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ పర్యవేక్షకునిగా ఆయన అందిస్తున్న సేవలు అమోఘమని ప్రశంసించారు.పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం తపించే లోకేష్ కేవలం 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పించి వేలాది కార్యకర్తల కుటుంబాలకు కొండంత భరోసా ఇస్తున్నారని గుర్తుచేశారు.ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను అధిష్టించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కోల కిషన్ రావు,పెద్దపల్లి మున్సిపల్ అధ్యక్షుడు కొప్పుల మురళి,పెరిక శ్రీనివాస్,బొంకూరు సతీష్, భూమయ్యతో పాటు జిల్లా పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొని లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

