Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుసావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం,కరీంనగర్

సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని శనివారం
ముకరంపుర లోని ధన్గర్ వడి స్కూల్ లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్ ,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోడూరి పరుశురాం గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మన దేశంలో ఆడపిల్లల చరిత్ర, వర్తమానం,భవిష్యత్తును అక్షరాలతో వెలిగించిన జ్ఞాన జ్యోతి భారతదేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలను ఎదుర్కొని, దాడులను ఎదుర్కొని, ఆడపిల్లలను బడిలోకి నడిపించారు అంటే ఆమె ఆ రోజుల్లో ఎంతో గుండె ధైర్యం గల ధీర వనిత అని చెప్పకనే చెప్పవచ్చును అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సీనియర్ నాయకులు కేశి పెద్ది శ్రీధర్ రాజు , ఆకుల నాగరాజు , బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి , బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వాయిల రాజకుమార్ , పురుషోత్తం ఆశిష్ గౌడ్ , మియాపురం రవీంద్ర చారి , బోయిని ప్రశాంత్ , గుమ్మడి శ్రీనివాస్ , కొత్తకొండ సాయి , ప్రవీణ్ కుమార్ బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘ నాయకులు తో పాటు ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular