Wednesday, March 11, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుసైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

నవగీతం,రుద్రంగి

సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతు సైబర్ క్రైం నిర్మూలనకు సంబందించిన వాల్ పోస్టర్ ను రుద్రంగి ఎస్ఐ శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భముగా ఎస్ఐ మాట్లాడుతూ..  సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత జాగ్రత్త వహించాలని, ఎవరు కూడా మోసపోవద్దని అన్నారు. యువత సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని. లోన్ ఆప్ లో లోన్లు ఇస్తామని చెప్తూ సైబర్ మోసగాల్లు లింక్ లు పంపిస్తారని, ఎవరు కూడా లోన్ ఆప్ లో లోన్లు తోసుకోవద్దని అన్నారు. లాటరీల పేరిట, జాబ్స్ పేరిట, ఓటిపిల పేరిట గాని, జాగ్రత్త వహించాలని తెలిపారు. యూరియా కోసం కూడా ఫెక్ ఓటిపిలు పంపిస్తూ రైతులను మోసం చేసే అవకాశం ఉందని, విద్యార్థులు ఇంటికి వెళ్లి మీ తల్లిదండ్రులు మీ బంధువులకు స్నేహితులకు సైబర్ మోసాలు జరగకుండా జాగ్రత్త వహించేలా చూసుకోవాలని కోరారు. సైబర్ మోసం జరిగినప్పుడు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని మండల ప్రజలను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular