నవగీతం, మేడ్చల్ మల్కాజిగిరి:
మల్కాజ్ గిరి ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో స్వామి వారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను బుధవారం ఎండోమెంట్ పర్యవేక్షణ అధికారి మోహన్ రెడ్డి సమక్షం లో లెక్కించగా రూ.5,88,058( ఐదు లక్షల ఎనబై ఎనిమిది వేల యాభై ఎనిమిది రూపాయలు) 49 రోజులకు గాను ఆదాయం వచ్చింది అని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎ బి రవీంద్ర రెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణా చార్యులు, అర్చకులు తులసి వెంకట రమణా చార్యులు, ఆలయ జూనియర్ అసిస్టెంట్ సండ్ర సుధాకర్, అభివృద్ధి కమిటీ సభ్యులు సానాధి శంకర్, హేమంత్ కుమార్, రత్నాకర్ రావ్, అనిత, రవీందర్ రెడ్డి, గణేష్ , మాజీ చైర్మన్ రాందాస్ సంతోష్, భక్తులు రత్నమాల, రత్న కుమారి, ప్రసన్న, లక్ష్మణ్, సుబ్బారావు, టి మధుసూదన్ రావు, ఫణికుమారి, కె వి ఎస్ ప్రసాద్, లక్ష్మీ, రవి కుమార్, నాగరాజ్, పద్మజ, వెంకటేశ్వర్లు, అశోక్, సందీప్ గౌడ్, సంజయ్ కుమార్, నిర్మల తదితర భక్తులు పాల్గొన్నారు.

