Saturday, April 18, 2026
ads
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లరుద్రంగిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

రుద్రంగిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం, రుద్రంగి:

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దెగావత్ తిరుపతి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి కేసీఆర్ పేద ప్రజలకు చేరువయ్యారని అన్నారు.

తెలంగాణ వస్తుందో రాదో అన్న మీమాంసలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రజలకు భరోసాగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌ కే దక్కిందన్నారు. ప్రభుత్వంలో ఉన్నా, లేకున్నా క్రమశిక్షణ కలిగిన క్రియాశీలక కార్యకర్తలుగా పార్టీకి ఎల్లప్పుడు అండగా ఉంటూ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని తెలిపారు. కేసిఆర్ పుట్టినరోజు వేడుకల్లో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, మానాల సర్పంచ్ బుర్ర శంకర్ గౌడ్, మాజీ ఎంపిపి గంగం స్వరూప మహేష్, వైస్ ఎంపిపి పిసరి భూమయ్య నాయకులు దయ్యాల కమలాకర్, గంగం మహేష్, చెప్యాల గణేష్, దయ్యాల నారాయణ, ఉప్పులూటి గణేష్, అల్లూరి గంగారెడ్డి, నాగులపెల్లి రవీందర్, గొల్లెం నర్సింగ్, ఏనుగు రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular