నవగీతం, రుద్రంగి ప్రతినిధి :
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం తండ్రి ఆకుల చిన్న గంగారం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. వారి వెంట గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, ఉప్పులుటి గణేష్, లావుడ్య మోహన్,దయ్యాల పెద్దులు, సింగరపు గంగరాజు, కొరిగంటి శ్యామ్, చెప్యాల గణేష్, మణిదీప్, చందుర్తి మండల సీనియర్ నాయకులు జలగం కిషన్ రావు, డప్పుల అశోక్, అబ్రహం, రమేష్ రావు, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

