Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపోలీస్ స్టేషన్లు క్లీన్ అండ్ గ్రీన్ వైపు

పోలీస్ స్టేషన్లు క్లీన్ అండ్ గ్రీన్ వైపు

📰 Generate e-Paper Clip

పరిశుభ్రతపై ఎస్పీ అశోక్ కుమార్ దృష్టి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా ‘ప్రేమిసెస్ మెయింటెనెన్స్ – క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలలో ఉన్న చెత్తను తొలగించడం, పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండడం ద్వారా ప్రజలకు మంచి వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular