Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్రకృతి వ్యవసాయం చేసి పర్యావరణం కాపాడుకోవాలి

ప్రకృతి వ్యవసాయం చేసి పర్యావరణం కాపాడుకోవాలి

📰 Generate e-Paper Clip

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ

నవగీతం,మల్లాపూర్:

రసాయన ఎరువులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణం, ఆరోగ్యం కాపాడుకోవచ్చని వ్యవసాయ అధికారి లావణ్య అన్నారు మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద వ్యవసాయ శాస్త్రవేత్తల చేత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం రైతులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి లావణ్య మాట్లాడుతూ ..ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయన ఎరువులు పురుగుమందులు ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో పంటలు పండించడం వల్ల నేల, పర్యావరణం రైతుల ఆరోగ్యము కాపాడుకోవచ్చని తెలిపారు.

ఈ విధానం వలన నేలలో జీవ అణువులు పెరుగుతాయి తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయవచ్చు మంచి నాణ్యత గల ఆహారం ఉత్పత్తి అవుతుంది రైతు ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు.ఈ పథకం ద్వారా వచ్చిన సాయిల్ హెల్త్ కార్డ్స్ మరియు  కిట్స్  రైతులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చిట్టాపూర్ గ్రామ సర్పంచ్ సంపతి శంకరమ్మ ముత్యం పెట్  సర్పంచ్ తేలు నరేష్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ చైర్మన్ వాకిటి భూమారెడ్డి,ఉప సర్పంచ్ బాలసాని ప్రణయ్ గౌడ్, వార్డు సభ్యులు శంకర్, వంశీ ,సంధ్య, గజానంద్ వైష్ణవి జిపిఓ రాజేష్, సెక్రటరీ అశోక్ రైతులు ఎర్రోలు వెంకటేశ్వర్లు, మహేష్ రాజేశ్వర్ రెడ్డి జీవన్ శ్యామ్ విక్రమ్ రజిత పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular