నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల లలో 20 తారీకు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పెట్టె బడ్జెట్ లో గల్ఫ్ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఏదైతే ఉందో రూ.500 కోట్లతో బడ్జెట్ పెట్టి ఎన్నారై తో కూడిన గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి 15 లక్షల గల్ఫ్ కార్మికుల కోరికను నెరవేర్చాలని దుబాయ్ నుండి ఫోన్ ద్వారా ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక గల్ఫ్ బడ్జెట్ చాలా అవసరమని దీనిపై తెలంగాణ లో ఉన్న ప్రతిపక్షాలు గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు పూర్తి మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను రాజాగౌడ్ రిక్వెస్ట్ చేశారు.గల్ఫ్ మృతుల కుటుంబాలకు వివిధ నియోజకవర్గాలో ఐదు లక్షల ప్రోసిడింగ్ పేపర్లు ఇచ్చారు కానీ గల్ఫ్ కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందలేదు అని మా దృష్టికి వచ్చిందని దీనికి కారణం ప్రత్యేక గల్ఫ్ బడ్జెట్ లేకపోవడంతోనే జాప్యం జరుగుతుందని రాజాగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బి మహేష్,ఎన్ రవీందర్,వి ప్రభాకర్, జి ప్రవీణ్ కె.వినీత్, ఎం కొమురయ్య గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు

