Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఅంజన్న క్షేత్రం మరింత భవ్యంగా–రాజగోపురం ముఖద్వారం త్వరలో నూతన కాంతి

అంజన్న క్షేత్రం మరింత భవ్యంగా–రాజగోపురం ముఖద్వారం త్వరలో నూతన కాంతి

📰 Generate e-Paper Clip

నవగీతం, కొడిమ్యాల

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో రాజగోపురం ముఖద్వారం మరమ్మతులు చేపట్టాలని ఆలయ ఈఓ అంజనారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.ఆలయ రాజగోపురానికి ఉన్న ముఖద్వారం వద్ద రెండు ద్వారాలు భిన్నంగా ఉండి, దర్శనార్థులకు ఆకర్షణీయంగా కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆలయ సౌందర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే మరమ్మతులు చేపట్టి, ద్వారాలను సమానంగా అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే ఈ క్షేత్రంలో సదుపాయాలు మెరుగుపరచడం ముఖ్యమని ఈఓ అంజన రెడ్డి తెలిపారు. మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేసి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular