నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా గడ్డం హరీష్ నియమితులయ్యారు. కోరుట్ల పట్టణంలోని ఐ.బి. గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆదేశానుసారం, జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు సమక్షంలో హరీష్‌ను జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులుకు, కమిటీ సభ్యులకు హరీష్ కృతజ్ఞతలు తెలియజేశారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, చట్ట పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ తెడ్డు శ్రీజ విజయ్, గడ్డం భూమేశ్వర్, నల్ల కొండయ్య, సాయికిరణ్, నందు, సమీద్, నగేష్ తదితరులు పాల్గొన్నారు

