Saturday, April 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఇబ్రహీంపట్నం కేజీబీవీ విద్యార్థినుల అద్భుత ప్రతిభ

ఇబ్రహీంపట్నం కేజీబీవీ విద్యార్థినుల అద్భుత ప్రతిభ

📰 Generate e-Paper Clip

ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

ఇబ్రహీంపట్నం మండలంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం, యంపిహెచ్ డబ్ల్యూ మరియు సిఈసి విభాగాల్లో విద్యార్థినులు అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాలకు మరియు మండలానికి గర్వకారణంగా నిలిచారు.ఈ విద్యాసంవత్సరం ఫలితాల్లో యంపిహెచ్ డబ్ల్యూ (1వ మరియు 2వ సంవత్సరం) సి ఈ సి (2వ సంవత్సరం) విభాగాల్లో పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం ఎ.నవిత (యం పి హెచ్ డబ్ల్యూ 1వ సంవత్సరం :500/491) (98.2%) మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది.డి. రష్మిత (యం పి హెచ్ డబ్ల్యూ 2వ సంవత్సరం: 1000/981) (98.1%) మార్కులు సాధించి సత్తా చాటింది. సీఈసీ విభాగం మెరిట్ సాధించిన వారు :2 వ సంవత్సరం జి.వైభవి :1000/ 951 మార్కులు 1వ సంవత్సరం యం.మాధవి 500/ 465 (93%) మార్కులు సాధించి మెరిసింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేక అధికారి మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థినులను అభినందించారు.విద్యార్థినుల కఠోర శ్రమ, ఉపాధ్యాయుల బోధన వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు.ఇంతటి గొప్ప ఫలితాలు సాధించిన విద్యార్థినులకు తల్లిదండ్రులు మరియు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular