Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకోరుట్ల ప్రజలకు పోలీసుల హెచ్చరిక

కోరుట్ల ప్రజలకు పోలీసుల హెచ్చరిక

📰 Generate e-Paper Clip

సర్వేల పేరుతో వచ్చే వారిని నమ్మకండి

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

ప్రభుత్వ సర్వేలు లేదా జనాభా లెక్కల పేరుతో ఇళ్లలోకి వచ్చే అపరిచిత వ్యక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎస్సై చిరంజీవి ప్రజలను కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం తరపున ఎక్కడా జనాభా లెక్కల సేకరణ జరగడం లేదు. ఎవరైనా ఆ పేరుతో వస్తే వారు మోసగాళ్లని గుర్తించాలి.ఇటీవల బోధన్‌లో సర్వే పేరుతో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఒక మహిళ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి. అనుమానం కలిగితే అపరిచితులను ఇంట్లోకి రానివ్వకండి.మీ పరిసరాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే ఈ క్రింది నంబర్లకు సమాచారం అందించండి: డయల్ 100,పోన్: 8712656790, పోన్: 8712656820, అప్రమత్తతే మీ ఆస్తికి, ప్రాణానికి రక్షణ.అనుమానం వస్తే వెంటనే పోలీసులను సంప్రదించండి.”

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular