నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఎస్సై చిరంజీవి తన సిబ్బందితో కలిసి జరిపిన తనిఖీల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన తునికి రాకేష్, అంతేనా మధులను అదుపులోకి తీసుకుని విచారించగా,పూసల వెంకటేష్ అనే వ్యక్తి హైదరాబాద్ నుండి గంజాయి తీసుకువచ్చి వీరికి సరఫరా చేస్తున్నట్లు తేలింది. దీంతో వారి వద్ద నుంచి 65 గ్రాముల గంజాయి, మూడు సెల్ ఫోన్లు మరియు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై చిరంజీవి, గంజాయి రవాణా లేదా విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

