నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:
2025-26 విద్యా సంవత్సరంలో మల్లాపూర్ మండలం గుండంపల్లి ప్రాథమిక పాఠశాల నుండి 12 మంది విద్యార్థులు వివిధ గురుకులాల్లో సీట్లు సాధించిన సందర్భంగా, మల్లాపూర్ ఎస్సై అనిల్ , గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య విద్యార్థులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థులు నైతిక విలువలను పాటిస్తూ సన్మార్గంలో ముందుకు సాగి, తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య ,ఉప సర్పంచ్ జగ్గుల గంగాధర్,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ , హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు అంజయ్య, ఉపాధ్యాయులు, సిరికొండ గంగారెడ్డి,కాగు కిరణ్ గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

