Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలసీతారామాలయంలో సీతమ్మకు 'ఓడి బియ్యం'

సీతారామాలయంలో సీతమ్మకు ‘ఓడి బియ్యం’

📰 Generate e-Paper Clip

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల పట్టణంలోని స్థానిక శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం సీతమ్మ వారికి ఓడి బియ్యం సమర్పించే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు సీతారాములకు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక అర్చనలు నిర్వహించి, మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు, ఆలయ ప్రాంగణంలో భారీగా అన్నప్రసాద వితరణ చేపట్టారు.కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయగా, భక్తుల రాకతో కోరుట్ల సీతారామాలయం ఆధ్యాత్మిక కోలాహలంగా మారింది.ఈ  కార్యక్రమంలో రామాలయ కమిటీ సభ్యులైన వనతడుపుల మురళి పాయికారి రవీంధర్ అడువాల ప్రభాకర్ చిద్రాల రాము గడ్డం రాజేంద్రప్రసాద్ ముక్క దామోదర్ చీటి సత్యంరావు కటుకం సునీల్ మోర్తాడ్ లక్ష్మి నారాయణ భీమనాతి రవికుమార్ పెడిమల్ల రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular