నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ ఉపసర్పంచ్ రాపల్లి మహేష్, వార్డు సభ్యులు బైండ్ల విశాల్, బత్తిని మనోజ్ చలివేంద్రాలను ఏర్పాటుచేశారు. డబ్బా గ్రామంలో గాంధీ సమీపంలో ఒకటి, గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో ఒకటి ఏర్పాటుచేసి డబ్బా గ్రామ విడిసి అధ్యక్షులు బైండ్ల సంజీవ్, పుప్పాల గజేందర్ ల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సౌకర్యార్థం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చలివేంద్రాలను ఏర్పాటు చేసిన వీరిని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కంటం రమేష్, లింగంపల్లి గంగాధర్, మాజీ ఎంపీటీసీ శాంత జీవన్, గ్రామ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు

