Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవైభవంగా పోతురాజు విగ్రహ ప్రతిష్టాపన

వైభవంగా పోతురాజు విగ్రహ ప్రతిష్టాపన

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కేంద్రం పెద్ద చెరువు సమీపంలో శ్రీపోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. వేదమంత్రాల నడుమ ప్రధాన అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, గ్రామదేవతల రక్షకుడిగా, గ్రామ ప్రజల ఆశీర్వాదంతో పోతురాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.ఈ సందర్బంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామదేవతల (గంగమ్మ, పోలేరమ్మ) తమ్ముడిగా పోతురాజును భావిస్తారని,బోనాల పండుగలో పోతురాజుల పాత్ర ఎంతో ప్రధానమైనది అని అన్నారు.ఈ కార్యక్రమం లో ద్యావతి ఉమేష్, ద్యావతి శ్రీనిత్, ద్యావతి శ్రీనివాస్, ద్యావతి ప్రణయ్,,దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సంగ రాజం యాదవ్,బీజేపీ మండల అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పూండ్ర లక్ష్మా రెడ్డి, భారాస నాయకులు ముద్దం శరత్ గౌడ్, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్,ముష్కరి రమేష్,ఎం.డీ.షబ్బీర్,ముత్యాల గంగరాజం, అల్లె చంద్రయ్య, భుక్యా శేఖర్,శనిగారపు నరేష్ క్యాతం శ్రీనివాస్ రెడ్డి,గడ్డం శ్రీనివాస్ రెడ్డి, బండారి రమేష్, ఎర్ర భూమయ్య, తొగరి నరేష్,సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular