జువ్వాడి నర్సింగ్ రావుకి ఘన సన్మానం
నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:
మెట్‌పల్లి పట్టణంలోని ముస్లిం షాదీఖానా నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి అదనపు నిధులను మంజూరు చేయించుటలో కీలక పాత్ర పోషించిన కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగరావుని మెట్‌పల్లి మార్కజీ ఇంతెజామీ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు, పట్టణ ముస్లిం ప్రముఖులు కలిసి సంప్రదాయ శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ నిధుల మంజూరుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గ సభ్యులకు సంబంధిత అధికారులకు మెట్‌పల్లి ముస్లిం సోదరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ షాదీఖానా నిర్మాణం పూర్తయిన తరువాత మెట్‌పల్లి పట్టణ ముస్లిం సమాజానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందని అభిప్రాయపడ్డారు.

