Saturday, May 9, 2026
ads
Homeతెలంగాణకరీంనగర్ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

📰 Generate e-Paper Clip

జనసేన పార్టీ కరీంనగర్ నియోజకవర్గం నాయకులు కాస రాజు

నవగీతం, కరీంనగర్:

మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ప్రభుత్వ క్యాంపు కార్యాలయం పై గురువారం బిజెపి నాయకులు చేసిన దాడిని జనసేన పార్టీ కరీంనగర్ నియోజకవర్గ నాయకులు కాస రాజు తీవ్రంగా ఖండించారు . ఈ మేరకు కాస రాజు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటి దాడులు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు పరుష పదజాలం వాడకుండా సంయమనం పాటించాలన్నారు. రాజకీయ ప్రత్యర్థుల కార్యాలయాలపై ఇలా భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. దాడులు చేస్తే, చేపిస్తే గొప్పవారుకారని ప్రజల్లో మరింత చులకని అవుతారన్నారు.రాజకీయ విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తారు కానీ ఇలా దారులు చేయడం సిగ్గుచేటు అన్నారు. సమాజంలో హుందాగా వ్యవహరించాల్సిన రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులే వీధి రౌడీల వలె వ్యవహరించడం తగదన్నారు. క్యాంపు కార్యాలయంలోని ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారన్నారు. పోలీసులు చూస్తుండగానే క్యాంపు కార్యాలయం పై దాడులు జరగడం శోచనీయమన్నారు. పోలీసులు దాడిని నియంత్రించకపోవడం విచారకరమన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన పార్టీలే ఇలా విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ దాడుల వరకు తెగబడడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు. రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత విభేదాలు సహజమని, రాజకీయ కక్ష సాధింపుల కోసం భౌతిక దాదులకు దిగడం సమాజానికి, నాయకులకు మంచిది కాదన్నారు. కరీంనగర్లో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు. దాడిలో పాల్గొన్న గుండాలను గుర్తించి, దాడికి ప్రేరేపించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular