Saturday, May 9, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమావోయిస్టు పార్టీ మాజీ కార్యదర్శి దేవుజి ని కలిసిన బీసీ నాయకులు

మావోయిస్టు పార్టీ మాజీ కార్యదర్శి దేవుజి ని కలిసిన బీసీ నాయకులు

📰 Generate e-Paper Clip

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

మావోయిస్టు పార్టీ మాజీ కార్యదర్శి దేవుజిని కోరుట్ల వారి నివాసంలో శుక్రవారం మల్లాపూర్ మండల బిసి నాయకులు బోయిని హన్మాండ్లు, జర్నలిస్ట్ మామిడాల వినోద్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం కోరుట్ల నియోజకవర్గంలో  వాస్తవిక పరిస్థితులను వారికి వివరించారు. అణగారిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను రాజకీయంగా ఆర్థికంగా గ్రామాల నుండి పట్టణాల దాకా అణిచివేతలకు గురవుతున్నాయని నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాలు వివరించి బడుగు బలహీన వర్గాలను బీసీ, ఎస్సీ ,ఎస్టీ మైనార్టీలను కలుపుకొని ఒక పెద్ద ఉద్యమం ఇక్కడ నుండి మొదలు చేయవలసిన అవసరం ఉందని వారికి తెలపడం జరిగిందని అన్నారు.అలాగే ప్రముఖ జర్నలిస్ట్ యువ రచయిత మామిడాల వినోద్ రచించిన ఆమె ఆఖరి పేజీ పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మల్లాపూర్ మండల బీసీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular