నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు రాష్ట్ర ప్రభుత్వంచే కల్లుగీతా సహకార పారిశ్రామిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్‌గా నామినేట్ అయిన మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్‌ను కొండగట్టు గౌడ నిత్యాన్నధాన సత్రం ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మంద వేణుగోపాల్ గౌడ్ ట్రస్ట్ ప్రచార కార్యదర్శి కోరెపు శ్రీకాంత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని కల్లుగీతా కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కృషి చేయాలని, సంప్రదాయ కల్లుగీత వృత్తిని పరిరక్షిస్తూ ఆధునిక పద్ధతులతో గీతా కార్మికులకు భద్రత,రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని నూతన చైర్మన్‌ను కోరినట్లు తెలిపారు.అలాగే కొండగట్టు గౌడ నిత్యాన్నధాన సత్రం అభివృద్ధికి సహకారం అందించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

