నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:
మెట్‌పల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావుకు ఘన సన్మానం నిర్వహించారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఖమ్మం నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు.ఈ సందర్భంగా ఖమ్మం నాగరాజు మాట్లాడుతూ జువ్వాడి నర్సింగరావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించడం కోరుట్ల నియోజకవర్గానికి గర్వకారణమన్నారు. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, ప్రజా సేవా దృక్పథాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ పదవిని కట్టబెట్టిందని తెలిపారు. వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయన సమర్థవంతంగా పనిచేసి అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి, పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వెలమ సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు అందిస్తున్న ప్రేమాభిమానాలు తనకు మరింత బాధ్యతను పెంచాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్, 13వ వార్డు అజయ్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మద్దివేని వెంకటేష్, బొంత రెడ్డి, ముద్రకోల శివకాశి, కోనేటి ప్రసాద్, ఖమ్మం నరేష్, చెరుకూరి శివరాం, కడారి జగదీష్, కోనేటి రోహిత్, సల్ల చిన్ను, వెనుముల మనోజ్, వెనుముల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

