నవగీతం , కోరుట్ల ప్రతినిధి
కోరుట్ల పట్టణంలోని 16వ వార్డు పరిధిలో మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారుల సమన్వయంతో యుద్ధప్రతిపాదికన మరమ్మతు పనులను ప్రారంభించడం జరిగిందని వార్డు కౌన్సిలర్ పొట్ట సురేందర్ తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో నీరు రావడం లేదని గుర్తించామని, ప్రస్తుతం జరుగుతున్న ఈ మరమ్మతులు పూర్తయిన వెంటనే అన్ని వీధులకు యథావిధిగా, పూర్తిస్థాయిలో నీటి సరఫరా పునరుద్ధరించబడుతుందని ఆయన వివరించారు.వార్డు ప్రజలు ఈ స్వల్పకాలిక అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని, సమస్య పరిష్కారానికి తాను నిరంతరం కృషి చేస్తున్నానని వార్డు ప్రజల సమస్యలు తీర్చడంలో నేను ఎల్లప్పుడూ నా వార్డు ప్రజల సేవకుడినే అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.


