Wednesday, April 22, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న జువ్వాడి

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న జువ్వాడి

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి

మల్లాపూర్ మండలం వాల్గోండ తండాలో ఇస్లావత్ జయరాం దంపతులకు చెందిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోకుండా నిజం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని జువ్వాడి నర్సింగరావు అన్నారు. పేద ప్రజల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్వర్యంలో సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధరంసోత్ సురేష్, కార్యదర్శి కవిత, ఉప సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పూండ్ర శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కోటగిరి ఆనంద్, ఎండీ జమాల్, రవి, వికాస్, కిరణ్, భరత్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular