మంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన శిరీష..
నవగీతం, జగిత్యాల /ధర్మపురి:
కష్టాల్లో ఉన్న అన్న అని ఆశ్రయిస్తే స్కూటీ ఇచ్చి ఆదుకున్నాడు మంత్రి మా లచ్చన్న అని దివ్యాంగురాలు శిరీష సంతోషం వ్యక్తం చేసింది.. వివరాల్లోకి వెళ్లితే.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామపూర్ గ్రామానికి చెందిన జొన్నల శిరీష దివ్యాంగురాలు.కుటుంబ పోషణ కోసం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో శిరీష ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగానికి నిత్యం వెళ్ళుతున్న శీరీషకు హైదరాబాద్ మహానగరంలో ప్రయాణం చేయడం కష్టంగా మారింది. నేపథ్యంలో తనకు ప్రభుత్వం ద్వారా సహాయం అందించాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ఇటీవల ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి కష్టాలు చెప్పుకోవడంతో చలించి పోయిన మంత్రి లక్ష్మణ్ కుమార్ శిరీషకు తన శాఖ ద్వారా స్కూటీని అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో గురువారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శిరీష కు స్కూటీ అందజేశారు. స్కూటీ అందుకున్న శిరీష ఆనందం వ్యక్తం చేసింది. ఆపదలో ఉన్న అన్న అని మంత్రి లచ్చన్నను కలవగానే తన కష్టాన్ని అర్థం చేసుకొని స్కూటీని అందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి శిరీష ధన్యావాదాలు తెలిపారు.

