Thursday, April 23, 2026
ads
Homeతెలంగాణజగిత్యాల"డిగ్రీ" విద్యార్థుల సంక్షేమం - కళాశాల సిబ్బంది "లక్ష్యం" : ప్రిన్సిపాల్ డాక్టర్ కే వేంకయ్య...

“డిగ్రీ” విద్యార్థుల సంక్షేమం – కళాశాల సిబ్బంది “లక్ష్యం” : ప్రిన్సిపాల్ డాక్టర్ కే వేంకయ్య ప్రకటన

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం కళాశాల సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తారని మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య స్పష్టంగా ప్రకటించారు. మెట్ పల్లి మండలంలోని రాజేశ్వర్ రావు పేటలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం రోజున డిగ్రీ కళాశాల సిబ్బంది అధ్వర్యంలో “దోస్త్” అడ్మిషన్ ల కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఎలాంటి కష్టం లేకుండా చూస్తామని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించి, వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, ఉపకార వేతనాల మంజూరు, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, అనుభవం అన్ని అర్హతలు ఉన్న బోధనా మరియు బోధనేతర సిబ్బంది వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అందువల్ల విద్యార్థుల సంక్షేమం కోసం రేయింబవళ్ళు కృషి చేస్తున్నామని ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య ప్రకటించారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులను తప్పకుండా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పంపాలని ఆయన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బందికి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విద్యార్థులను పంపుతామని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మచ్చేందర్, గ్రామ పంచాయతీ సర్పంచ్ కే. లక్ష్మీ – శ్రీధర్, ఉప సర్పంచ్ రాజ్ కుమార్,వేణు గోపాల్ తదితరులు భరోసా ఇచ్చారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్యను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మచ్చేందర్, సర్పంచ్ లక్ష్మీ – శ్రీధర్ తదితరులు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న, కళాశాల అకాడమిక్ కో-ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, సిబ్బంది లక్ష్మి నారాయణ, శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular