నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ ఎల్లమ్మ కాలనీ (నక్కల గుట్ట)లో కొలువై ఉన్న శ్రీ రేణుక మాత దేవాలయంలో, కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల మహోత్సవ మంగళాహ్వానము అత్యంత వైభవంగా జరగనుంది.ఈ నెల 22-04-2026 నుండి 29-04-2026 వరకు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా గోదావరి జలాలతో గంగాస్నానం,జోగి ఎత్తుట, మాతలకు జలాభిషేకం, పోచమ్మ బోనాలు మరియు ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ బోనాల ఊరేగింపు వంటి విశేష కార్యక్రమాలు ఉంటాయి. కౌండిన్య గౌడ సంఘం ప్రతినిధులు ఈ వేడుకలను భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, కావున భక్తులందరూ ఈ బోనాల మహోత్సవంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి, రేణుక ఎల్లమ్మ తల్లి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

