నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం సీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దావా వసంత సురేశ్ మాట్లాడుతూ ఎన్నో కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని బిఆర్ఎస్ పార్టీలో ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలి దానాలు అయితే ఈరోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల బలిదానం అవుతుందని స్వరాష్ట్ర పాలనలో కాకుండా సమైక్య పాలనలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి పాలన ఉందని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యల నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసం వద్ద వేడుకలు
ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసం వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసం, ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం వద్ద పార్టీ సీనియర్ నాయకులు అయిల్నేని సాగర్ రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


