Wednesday, June 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపాఠశాల అభివృద్ధికి గ్రామ సర్పంచుల కృషి అభినందనీయం

పాఠశాల అభివృద్ధికి గ్రామ సర్పంచుల కృషి అభినందనీయం

📰 Generate e-Paper Clip

మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మరియు విద్యార్థుల నమోదు పెంపునకు చేస్తున్న కృషి అభినందనీయమని మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి తెలిపారు. బడిబాట కార్యక్రమం సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు విద్యార్థుల చేర్పుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గ్రామస్థులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులను ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా రాఘవపేట ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ తోట శ్రీనివాస్, ఉపసర్పంచ్ మద్దెల నర్సయ్యలు మాజీ ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యుడు అమీనుద్దీన్ కుమార్తె తో పాటు మరో పది మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించి వారికి పాఠ్యపుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ తోట శ్రీనివాస్ మాట్లాడుతూ, గత విద్యా సంవత్సరంలో మల్లాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమన్నారు. అంతేకాకుండా 29 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ (RGUKT)లో సీట్లు సాధించడం మండల విద్యా రంగానికి గొప్ప విజయమని పేర్కొన్నారు.మండలంలోని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారి విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని, వారి సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఇదే విధంగా విద్యాభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular