Monday, April 27, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలగ్రీవెన్స్ డే లో పలు ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే లో పలు ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పలు ఫిర్యాదులను పరిశీలించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై న్యాయపరంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలోకి వచ్చే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, విచారణలో ఎటువంటి లోపం ఉండకూడదని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులను స్వీకరించి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించడం జరుగుతోందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular