Tuesday, April 28, 2026
ads
Homeతెలంగాణఖమ్మంకృత్రిమ కొరత సృష్టిస్తున్న ఆయిల్ కంపెనీలు

కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఆయిల్ కంపెనీలు

📰 Generate e-Paper Clip

కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రజల ఇబ్బందులు

వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్

నవగీతం,వైరా ప్రతినిధి:

డీజిల్ పెట్రోల్ కొరతలను కావాలనే ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని బెంగాల్ ఎన్నికల తర్వాత భారీగా పెట్రోల్ డీజిల్ ధరను పెంచనున్నారని అందులో భాగంగా ఈ ఆయిల్ కొరత సృష్టిస్తున్నారని వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ అన్నారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ… ప్రజలు డీజిల్ పెట్రోల్ గ్యాస్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడ వలసిన పరిస్థితి ఏర్పడిందని, ఇంత జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తూ నరేంద్ర మోడీ కార్పొరేట్ కంపెనీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. పెట్రోల్ డీజిల్ దొరకా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి అని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కార్పొరేట్ జపం మాని ప్రజల కష్టాలు తీర్చాలని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపై ఆయిల్ కొరతపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతుందని ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజల ఇబ్బందులు తొలగించాలని కట్ల సంతోష్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular