Tuesday, April 28, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపుష్కరాల పనులు వేగవంతం చేయాలి..

పుష్కరాల పనులు వేగవంతం చేయాలి..

📰 Generate e-Paper Clip

రహదారుల నిర్మాణం కోసం కేంద్ర మంత్రులను కలుస్తాం..

ధర్మపురిలో పుష్కరాల పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి అడ్లూరి..

నవగీతం, జగిత్యాల/ ధర్మపురి:

గోదావరి పుష్కరాల పనులతో పాటు ధర్మపురి క్షేత్రం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలు, ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంగళవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో పాటు వివిధ శాఖల అధికారులతో ధర్మపురిలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని అన్నారు. అధికారులు ఇప్పటికే తయారుచేసిన ప్రణాళికలు మరో మారు పున సమీక్షించి ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు రాకుండ చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పుష్కరాలు కావాల్సిన నిధుల కోసం త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తానని మంత్రి తెలిపారు.ధర్మపురి మండలం రాయపట్నం నుండి ధర్మపురి వరకు ఉన్న నేషనల్ హైవే 63 అభివృద్ధి పనుల నిధుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్గరిని కలిసి నిధులు సమకూర్చాలని కోరుతామని మంత్రి అన్నారు. ధర్మపురి క్షేత్రం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. భూసేకరణకు ఉన్న ఇబ్బందులను స్థానికులతో చర్చించి భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యే విధంగా స్థానిక నేతలు చోరవ తీసుకోవాలని మంత్రి సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular