వివేకానంద హై స్కూల్ ఫౌండర్ అండ్ కరస్పాండెంట్ శ్రీహరి, వేణుగోపాల్
నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:
విద్యార్థులు కష్టంతో పాటు ఇష్టపడి చదివినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని విద్యార్థులను చదువుల విషయంలో పాఠశాలల యాజమాన్యాలు కష్టపెడుతున్నాయని ఎప్పటికీ అనుకోకూడదు అని వివేకానంద హై స్కూల్ ఫౌండర్ అండ్ కరస్పాండెంట్ లు శ్రీహరి, వేణుగోపాల్ లు అన్నారు. గత మూడు రోజుల క్రితం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో వివేకానంద విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించగా శుక్రవారం పాఠశాల ఆవరణలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు వందకు వందశాతం మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారని ఈ విజయం పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు గర్వించదగ్గ విషయమని విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించేందుకు సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


