Thursday, September 24, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకార్మికుల సంక్షేమానికి భరోసా: సొంత నిధులతో ఇన్స్యూరెన్స్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కార్మికుల సంక్షేమానికి భరోసా: సొంత నిధులతో ఇన్స్యూరెన్స్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

నవగీతం ,కోరుట్ల ప్రతినిధి :

మే డే వేడుకల సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కార్మికుల పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కోరుట్లలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లోని వ్యాపార సముదాయాల్లో శ్రమిస్తున్న కార్మికులకు తన స్వంత నిధులతో లేబర్ మరియు ఇన్స్యూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి కార్మికులే వెన్నెముక అని కొనియాడారు. కార్మికులంతా ఐకమత్యంతో యూనియన్‌గా ఏర్పడితే హక్కుల సాధన సులభమవుతుందని, వారి సమస్యల పరిష్కారంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో బ్యాంక్ ఎల్‌డిఎమ్ రామ్ కుమార్‌తో కలిసి కార్మికులకు స్వయం ఉపాధి, ప్రభుత్వ పథకాలు మరియు బ్యాంకు రుణాల పొందే విధానంపై అవగాహన కల్పించి, ఆర్థికంగా ఎదిగేందుకు ఈ సదవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్మికులతో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular