Friday, May 8, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలని వడ్లు రోడ్డుపై పోసి ధర్నా

ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలని వడ్లు రోడ్డుపై పోసి ధర్నా

📰 Generate e-Paper Clip

కలెక్టర్‌ను రప్పించాలని డిమాండ్‌ – రోడ్డుపై బైఠాయించిన రైతులు

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామ హైవేపై సోమవారం రైతులు వడ్లు రోడ్డుపై పోసి బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ స్వయంగా ఘటనాస్థలానికి రావాలని డిమాండ్ చేశారు.వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని, తాలు తరుగు పేరుతో నష్టపరుస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు.ధర్నాకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాజీ జెడ్పిటిసి కృష్ణారావు మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు.వివిధ గ్రామాల నుంచి రైతులు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ధర్నాతో ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మహిళా రైతులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అనంతరం తహసీల్దార్ నరేష్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కోడిమ్యాల మల్యాల పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular