సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు
నవగీతం,వైరా ప్రతినిధి:
గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు అన్నారు.సోమవారం రోజున వైరా మండలం పరిధిలోని కేజీ సిరిపురం గ్రామంలో గ్రామపంచాయతీ ఆఫీస్ నందు గ్రేస్ జనరల్ హాస్పిటల్ తనికెళ్లవారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించి ముందుగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషికి సంపద కన్నా ఆరోగ్యం ఎంతో ముఖ్యమని అన్నారు.గ్రేస్ జనరల్ హాస్పిటల్ తనికెళ్లవారు గ్రామీణ ప్రజల ఆరోగ్యం పట్ల దృష్టి సారించిందని తెలిపారు.ఈ శిబిరానికి 170 మంది హాజరు కాగా గ్రేస్ హాస్పిటల్ సిబ్బంది షుగర్,బీపీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి కంటి డాక్టర్ ద్వారా ఉచితంగా కళ్ళ పరీక్షలు నిర్వహించారు. సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు వైద్య పరీక్షలు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.గ్రేస్ హాస్పిటల్ వారు గ్రామీణ ప్రాంతాల్లో నిపుణులైన వైద్యులను నియమించి ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు నరసింహారావు, ప్రశాంత్, ప్రోగ్రాం మేనేజర్ అరుణ్ సందీప్,కన్వీనర్ మోదుగు వినోద్ కుమార్,హాస్పటల్ సిబ్బంది,గ్రామ ప్రజలు, పెద్దలు పాల్గొన్నారు.

