Thursday, May 7, 2026
ads
Homeతెలంగాణపెద్దపల్లిరైస్ మిల్లులో ‘ఫోర్జరీ’ భాగోతం అధికారుల అండతోనే ధాన్యం కేటాయింపులు

రైస్ మిల్లులో ‘ఫోర్జరీ’ భాగోతం అధికారుల అండతోనే ధాన్యం కేటాయింపులు

📰 Generate e-Paper Clip

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి-మిల్లు భాగస్వామి ఎల్లెంకి సుధాకర్

నవగీతం, పెద్దపల్లి, ప్రతినిధి:

పెద్దపల్లి మండలం పెద్దబొంకూరులోని సాయి గణేష్ ఇండస్ట్రీస్‌లో నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కేటాయిస్తున్న అధికారులపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆ మిల్లు భాగస్వామి ఎల్లెంకి సుధాకర్ డిమాండ్ చేశారు.ఈ మేరకు గురువారం ఆయన పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎల్లెంకి సుధాకర్ మాట్లాడుతూ తమ మిల్లులో నెలకొన్న వివాదాల గురించి అధికారులకు ముందే వివరించినప్పటికీ పట్టించుకోకుండా ధాన్యం కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.మిల్లులో మొత్తం తొమ్మిది మంది భాగస్వాములు ఉండగా,గత కొంతకాలంగా ఆర్థిక,వ్యాపార లావాదేవీలపై వివాదాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు.మేనేజింగ్ పార్టనర్లుగా ఉన్న ఎల్లెంకి రవీందర్,ఎల్లెంకి మధుకర్ మరణించిన నేపథ్యంలో మిల్లుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను నిలిపివేయడం జరిగిందని తెలిపారు.అయితే మరో భాగస్వామి ఎల్లెంకి దివాకర్ ఫోర్జరీ సంతకాలు,నకిలీ పత్రాలు సృష్టించి అధికారులను,మిగతా భాగస్వాములను మోసం చేస్తూ మిల్లును నిర్వహిస్తున్నారని ఆరోపించారు.గత ఐదేళ్లుగా భాగస్వామ్య ఒప్పందాలను ఉల్లంఘిస్తూ లాభాల్లో వాటా ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇండియన్ పార్టనర్‌షిప్ చట్టం ప్రకారం భాగస్వాములందరి అంగీకారం లేకుండా ఎలాంటి ధాన్యం కేటాయింపు ఒప్పందాలు జరగకూడదని,కానీ పౌర సరఫరాల శాఖ అధికారులు దివాకర్‌తో కుమ్మక్కైనిబంధనలు ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు.ఈ యాసంగి సీజన్‌లో కూడా మిల్లుకు ధాన్యం ఇవ్వవద్దని ఏప్రిల్ నెలాఖరులో జిల్లా కలెక్టర్‌కు,సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని,మళ్ళీ అదే మిల్లుకు ధాన్యం కేటాయించడం శోచనీయమని అన్నారు. తమకు తెలియకుండా కేటాయించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని ప్రభుత్వానికి సీఎంఆర్ ఎగవేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.సాధారణంగా మిల్లర్లు ఎగవేతకు పాల్పడితే భాగస్వాములందరిపై క్రిమినల్ కేసులు పెడతారని,ఇవన్నీ తెలిసి కూడా అధికారులు అక్రమంగా ధాన్యం కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి,బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుధాకర్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular