Sunday, May 10, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమెట్‌పల్లిలో టీ10 క్రికెట్ సందడి

మెట్‌పల్లిలో టీ10 క్రికెట్ సందడి

📰 Generate e-Paper Clip

టోర్నమెంట్‌ను ప్రారంభించిన జువ్వాడి నర్సింగరావు

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

మెట్‌పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియం వేదికగా టి10 క్రికెట్ ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు.క్రీడలతోనే క్రమశిక్షణ, ఉజ్వల భవిష్యత్తు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని.క్రీడలు శారీరక దృఢత్వాన్ని ఇవ్వడమే కాకుండా క్రమశిక్షణ, ఓర్పు మరియు టీమ్ వర్క్ నేర్పుతాయి.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.పెద్ద ఎత్తున తరలివచ్చిన క్రీడాకారులు, అభిమానులతో అంబేద్కర్ స్టేడియం కోలాహలంగా మారింది. టోర్నమెంట్ ఆర్గనైజర్లు క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించి మ్యాచ్‌లను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. నిర్వాహకుల కృషి అభినందనీయం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు , టోర్నమెంట్ ఆర్గనైజర్లు , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ,క్రీడాకారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular