నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భక్తుల ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న కొండగట్టు అంజన్న దేవస్థానంలో జగిత్యాల ఆర్‌డీఓ మధుసూదన్ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆర్‌డీఓ గోత్రనామాలు చదివి స్వామివారి ఆశీస్సులతో తీర్థ ప్రసాదాలు అందజేశారు.దేవాలయ ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి భావంతో జరిగిన ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. అనంతరం ఆలయ పర్యవేక్షకుడు ఉపాధ్యాయుల చంద్రశేఖర్ శాలువాతో ఆర్‌డీఓ మధుసూదన్‌ను సత్కరించారు.ఈ కార్యక్రమంలో మల్యాల రెవెన్యూ పరిశీలకుడు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

