Thursday, September 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

📰 Generate e-Paper Clip

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ ధరూర్ క్యాంప్ పాఠశాలలో పియంశ్రీ ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు, ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండే సమ్మర్ క్యాంప్ లు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం వల్ల బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.అలాగే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ  పాఠశాలలు పనిచేస్తున్నాయని అన్నారు. విద్యార్థులు అందరూ సమ్మర్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సమ్మర్ క్యాంపులో ఏర్పాటు చేసిన అబాకస్, బాక్సింగ్, కాలిగ్రఫీ,ఆటలు, డాన్స్ తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ… ఎండాకాలం విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా సమ్మర్ క్యాంపు ఉపయోగపడుతుందని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular