జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బడుగు లాజరస్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
దళిత క్రైస్తవుల హక్కుల కోసం జరుగుతున్న అవగాహనా సదస్సును విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బడుగు లాజరస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా గార్డెన్ లో మంగళవారం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ డాక్టర్ మంద కృష్ణ మాదిగ హాజరవ్వానున్నారని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం, దళిత క్రైస్తవుల హక్కులు, భారత రాజ్యాంగం దళిత క్రైస్తవులకు అందించే అనేక విషయాలపై అవగాహనా కల్పిస్తారని తెలిపారు. తమ హక్కుల కోసం దళిత క్రైస్తవులు సదస్సుకు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లాలోని పాస్టర్స్, సంఘం పెద్దలు, విశ్వాసులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు బడుగు లాజరస్ పిలుపునిచ్చారు.

