దమ్మయ్యపేటకు నూతన జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా నియామకం
నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
క్రీడల్లో ప్రతిభ కనబరిచి స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన యువకుడు కంచర్ల సత్యం కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట గ్రామపంచాయతీకి నూతన జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా నియమితులయ్యారు. జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాల మేరకు సోమవారం కొడిమ్యాల మండల ఎంపీడీవో కార్యాలయంలో నియామక పత్రాన్ని సూపరింటెండెంట్ రాజమణి, సీనియర్ అసిస్టెంట్ సురేష్ కుమార్ అందజేశారు.అనంతరం కంచర్ల సత్యం అధికారికంగా విధుల్లో చేరినట్లు అధికారులు తెలిపారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సత్యం పేర్కొన్నారు.స్థానికులు, స్నేహితులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

