Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకోరుట్లలో పలు శుభకార్యాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు సురభి నవీన్ కుమార్

కోరుట్లలో పలు శుభకార్యాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు సురభి నవీన్ కుమార్

📰 Generate e-Paper Clip

నవగీతం,కోరుట్ల ప్రతినిధి :

కోరుట్ల నియోజకవర్గ బీజేపీ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ మంగళవారం పట్టణంలో పలు సామాజిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త గుండేటి నాగభూషణం మరియు వారి కుమారులు రాజశేఖర్ & బ్రదర్స్ నూతన గృహప్రవేశం బుధవారం జరగనున్న నేపథ్యంలో మంగళవారం వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం, ఉపాధ్యాయులు వనతడుపుల రవికుమార్ కుమారుడు రాఘవ వివాహం ఇటీవలే జరగడంతో, వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా, హనుమాన్ జన్మొత్సవం సందర్భంగా ఎకిన్ పూర్ లోని పంచముఖ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న నవీన్ కుమార్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయన వెంట బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular