నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది.తెల్లవారుజామునే భారీ సంఖ్యలో చేరుకున్న భక్తులు కోనేరు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మొక్కులు చెల్లించుకున్న అనంతరం క్షేత్రపాలకుడైన శ్రీ బేతలస్వామి ఆలయంను కూడా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయానికి సుమారు 20 వేల మంది భక్తులు విచ్చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.ఆలయ ప్రాంగణంలో రద్దీని నియంత్రిస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పించారు.ఉప ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్, అరుణ్, అనిల్, లక్ష్మణ్ ప్రసాద్ భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి ఆలయ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఏఈఓ హరిహర్నాథ్, సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సునీల్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


