Friday, September 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాల​మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి కి ఘన సన్మానం

​మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి కి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం, హైదరాబాద్:

ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని చంపాపేట్ సాము సరస్వతి గార్డెన్స్‌లో నిర్వహించిన “అభినందన సత్కారం” కార్యక్రమంలో మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ని ఘనంగా సన్మానించారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఆర్యవైశ్య సమాజం నుండి ప్రజాప్రతినిధిగా ఎన్నికై, ప్రజలకు విశేష సేవలందిస్తున్నందుకు గాను ఆయనకు ఈ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ సభాధ్యక్షత వహించారు.ముఖ్య అతిథుల సమక్షంలో…తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మరియు హ్యాండ్లూమ్స్ & టెక్స్‌టైల్స్ శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు మాజీ మంత్రివర్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై చైర్మన్ మైలారపు లింబాద్రి ని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీత, చైర్మన్ సత్కరించిన ఆర్యవైశ్య మహాసభ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ మహోత్సవంలో రాష్ట్ర నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా గెలుపొందిన పలువురు ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులను కూడా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో సమాజ బంధువులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular