పత్రికా రంగం ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభం..
బాధ్యతాయుత జర్నలిజంతో ప్రజలకు సేవ చేయాలి: డీఎస్పీ శ్రీనివాస్ లు
టీయూడబ్ల్యూజే హెచ్-143 వేములవాడ ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం గురువారం రోజున రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా ఆధ్వర్యంలో వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్ లు టౌన్ సీఐ వీరప్రసాద్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు,ఈ సందర్భంగా డీఎస్పీ, సీఐలను శాలువాలతో సత్కరించి, శ్రీ వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గాన్ని డీఎస్పీ శ్రీనివాస్ లు, టౌన్ సీఐ వీరప్రసాద్ శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నరసయ్య, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీతో పాటు కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన కార్యవర్గం పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ లు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్థంభంగా కీలక బాధ్యతను నిర్వర్తిస్తోందన్నారు. ప్రజలకు వాస్తవాలను నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సామాజిక సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పోలీసు శాఖ–మీడియా పరస్పర సహకారం ఎంతో అవసరమని అన్నారు.వాస్తవాల ఆధారంగా వార్తలను ప్రచురించడం ద్వారా ప్రజల్లో మీడియాపై విశ్వాసం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు పాత్రికేయుల సంక్షేమం కోసం కూడా నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షిస్తూ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రేగుల రాంప్రసాద్, జిల్లా క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ సయ్యద్ రసూల్, ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులు కొత్వాల్ శ్రీనివాస్, జితేందర్ రావు, ఉపాధ్యక్షులు సిహెచ్ దేవరాజ్, విష్ణు, కోశాధికారి పంపరి నాగరాజు, ఫాహద్, జింక శ్రీధర్,కమటాల విజయ్, దెబ్బేటి ప్రవీణ్, శ్రీరామోజు వేణు, సంటి రాజేందర్, షబ్బీర్ గంగాధర్, పండుగ స్వామి, నవీన్, ఆసీమ్,లక్ష్మీనారాయణ,రాము పాల్గొన్నారు.


