Thursday, September 17, 2026
ads
Homeకరీంనగర్ప్రాచీన విజ్ఞానాన్ని గుర్తించండి తాళపత్రాలు,గ్రంథాలు, శాసనాలు సేకరించాలి

ప్రాచీన విజ్ఞానాన్ని గుర్తించండి తాళపత్రాలు,గ్రంథాలు, శాసనాలు సేకరించాలి

📰 Generate e-Paper Clip

డిజిటలైజ్ చేసేందుకు సహకరించాలి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే

కరీంనగర్, సెప్టెంబర్11,(నవగీతం):ప్రాచీన విజ్ఞానాన్ని భద్రపరచడానికి, డిజిటలైజ్ చేసేందుకు జ్ఞాన్ భారతం మిషన్ కార్యక్రమాన్ని భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిందని, ఇందులో భాగంగా జిల్లాకు చెందిన ప్రాచీన తాళపత్రాలు, గ్రంథాలు, శాసనాలను గుర్తించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులకు సూచించారు.జ్ఞాన్ భారతం మిషన్ లో భాగంగా విద్య, పురావస్తు, దేవాదాయ, మైనారిటీ,టూరిజం, సమాచార తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్ లోని అడిషనల్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు.ఇది సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న ప్రాచీన తాళపత్రాలు, గ్రంథాలు లోహాలపై, రాతిపై వివిధ భాషల్లో చెక్కిన పురాతన రచనలు, పద్యాలు వంటివి సేకరించాలని సూచించారు.కరీంనగర్ జిల్లాలో మరుగున పడిన అమూల్యమైన గ్రంథాలు, శాసనాలు వంటివి సేకరించాలని సూచించారు.

ప్రార్థన మందిరాలు,చారిత్రక ప్రాంతాల్లో ఈ అమూల్య సంపద ఉండే అవకాశం ఉంటుందని, 70 సంవత్సరాల క్రితం నాటి ఏ గ్రంథాలనైనా గుర్తించాలని లేదా సేకరించాలని సూచించారు. సంస్కృతం, ఉర్దూ, తెలుగు, అరబిక్, పర్షియన్ తదితర భాషల్లో రాగి వంటి లోహాలు, తాటాకులపై రాసిన గ్రంథాలను గుర్తించి డిజిటలైజ్ చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. భాషా పండితులు, పురావస్తు, టూరిజం, దేవాదాయ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పురాతన విజ్ఞానాన్ని గుర్తించి భద్రపరిచేందుకు సమన్వయంతో పని చేయాలని అన్నారు. జిల్లాకు చెందిన ప్రజలు ఎవరైనా ఇలాంటి పురాతన అమూల్య గ్రంథాలు, శాసనాలకు సంబంధించిన సమాచారాన్ని 9640967943 సెల్ నెంబర్ కు తెలియజేయాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి స్వామి, విద్య దేవాదాయ,ఆర్కియాలజీ,టూరిజం, మైనారిటీ, సమాచార తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular