Monday, November 2, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలగుండంపల్లిలో నూతన జమ్మి గద్దె ప్రారంభం

గుండంపల్లిలో నూతన జమ్మి గద్దె ప్రారంభం

📰 Generate e-Paper Clip

గ్రామ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య

మల్లాపూర్, అక్టోబర్ 21 (నవగీతం):

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక మేరకు నూతనంగా నిర్మించిన జమ్మి గద్దెను గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య ప్రారంభించారు. గ్రామ వికాస కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిర్మాణానికి సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య దాతగా వ్యవహరించారు.

గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలనే ఉద్దేశంతో జమ్మి గద్దెను నిర్మించడంతోపాటు, జమ్మి చెట్టును నాటి అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామంలో జమ్మి గద్దె నిర్మాణం పూర్తవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల కోరికను నెరవేర్చిన సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్యకు వీడీసీ పెద్దమనుషులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, మాజీ సర్పంచ్ మామిడి లక్ష్మారెడ్డి, వీడీసీ పెద్దమనుషులు రాజేందర్, రాజారెడ్డి, గంగాధర్, శేఖర్, రంజిత్, నరేష్, ముత్యాలు తదితరులతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular