Thursday, April 16, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలవాసవి మాత ఆలయంలో అయ్యప్ప మహా పడిపూజ.

వాసవి మాత ఆలయంలో అయ్యప్ప మహా పడిపూజ.

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ సౌడాల వినోద్ కుమార్ గురు స్వామి కరచరణములచే అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు.గౌరీ పూజ, కుంకుమార్చన, గణపతి పూజ, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి పూజ, మెట్ల ఆరాధన మహాపడి ఉత్సవం హారతి భజనలతో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయమంతా మారుమ్రోగింది. భక్తులంత ఆనంద పరవశాలతో మునిగిపోయారు. అనంతరం అయ్యప్ప స్వాముల తో పాటు వచ్చిన భక్తులందరికీ భిక్ష ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు సోమ అశ్విని కుమార్, కార్యదర్శి చింత శశిధర్, కోశాధికారి నూనె పెద్ద శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు దామెర రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపల్లి ఆదిరెడ్డి, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular